PPM: స్వచ్ఛ పార్వతీపురంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జేసీ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.