E. G: రాజానగరం సూర్యారావుపేటలో భర్తతో గొడవపడి శ్రీజ్యోతి (25) అనే వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. భర్త కృష్ణ ఏ పనికి వెళ్లకుండా జులాయిగా తిరగడంతో భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై శ్రీజ్యోతి ఉరేసుకుంది. రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి తరలించారు.