MNCL: ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో చలి తీవ్రత పెరిగింది. శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయా మండలాల్లో 17 నుంచి 19 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు ప్రాంతాలలో పొగ మంచు కమ్ముకుంది. రాబోయే ఐదు రోజులపాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.