TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలించి.. న్యాయ నిపుణులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్లపై వివిధ సంఘాలతో కూడా చర్చిస్తామన్నారు. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గొద్దని సీఎం చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో నోటిఫికేషన్ కష్టమేనని విశ్వసనీయ వర్గ సమాచారం.