SRCL: చందుర్తి మండల కేంద్రం నుంచి గోవిందారం వెళ్లే రహదారిపై ఇలా వరి ధాన్యం ఆరబెట్టి. కట్టెలను, బండరాలను అడ్డుగా ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళ ఏ మాత్రం ఏమరపాటుగా వెళ్లినా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. పంటఉత్పత్తులను నిల్వ చేసేందుకు ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.