ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు FSSAI కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. తమ ఉత్పత్తులపై ఉన్న ORS అనే పదాన్ని తక్షణమే తొలగించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ORS అనేది ఔషధానికి సంబంధించిన పదం అని.. దాన్ని ఆహార ఉత్పత్తులు, పానీయాల ప్యాకెట్లపై వాడటం సరికాదని FSSAI స్పష్టం చేసింది. వినియోగదారులను తప్పుదారి పట్టించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.