KKD: కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన వడ్లమూరి పెద్దింట్ల (35) తాండవ నదిలో మునిగి మృతి చెందారు. గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగిందని ఎస్సై రామకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోటనందూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.