NZB: రాష్ట్రంలోని రోడ్లు ప్రజలకు నిత్య నరకంగా మారాయని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. వర్షాలకు ధ్వంసమైన రోడ్లను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. కనీసం రోడ్ల మరమ్మతుల కోసమైనా పైసా ఇవ్వడం లేదని ఆరోపించారు. నెలలు గడుస్తున్నా రోడ్లను పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మ్మెల్యే గురువారం ట్వీట్ చేశారు.