కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం గ్రామం తొగరుపాయ వద్ద విష్ణుశాలలో నిర్వహించిన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పీ. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, అత్యవసర వైద్య చికిత్సల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ నిధి అనేక కుటుంబాలకు బాసటగా నిలుస్తోందని తెలిపారు.