PPM: జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలుకు ఇప్పటినుంచే సన్నద్ధత కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్ల సంసిద్దతపై మండల తహశీల్దార్లు, వ్యవసాయాధికారులు, గ్రామ వ్యవసాయాధికారులతో జేసీ గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.