కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా రేపు ఉదయం 10:00 గంటలకు నిజాంసాగర్ మండల కేంద్రంలోని 12 గేట్లు, గుల్‌గస్త్ వద్ద “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పర్యవేక్షకులు రాజ్‌పాల్ సింగ్ ఖరోలా, జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, MLA హాజరవుతున్నట్లు మండల నాయకులు తెలిపారు.