ATP: అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి, కందుకూరు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలను ఎన్-బ్రాండ్ కల్తీమద్యం తాగొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం తగదని మండిపడ్డారు.