JN: జనగామ పట్టణ కేంద్రంలోని బతుకమ్మ కుంటలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ఇవాళ పరిశీలించారు. వీలైనంత త్వరగా నాణ్యతతో కూడుకున్న పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ అభివృద్ధి పనులతో జనగామ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతోంది అన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులున్నారు.