MBNR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ నేత మైత్రి యాదయ్య ఆరోపించారు. గురువారం పట్టణంలోని మైత్రినగర్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజామత్ అలీకి అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. బీజేపీ దేశవ్యాప్తంగా ఓటు చోరీకి పాల్పడుతుందని మండిపడ్డారు.