PDPL: ఎలిగేడు మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్సై మధుకర్ హెచ్చరించారు. రాత్రివేళ ధాన్యం రాశులు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత రైతులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.