BHNG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా కల్పించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య సంతోష్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం R&B గెస్ట్ హౌస్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18న బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.