BPT: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంతమాగులూరు మండలం ఎంపీడీవో జ్యోతిర్మయి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0పై సిబ్బందికి, ప్రజలకు వివరించారు. నిత్యవసర సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు వంటివి నూతన జీఎస్టీ విధానం లాభదాయకమని ఆయన వెల్లడించారు.