KMM: నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని పి.శ్లోక ఎముకలకు వచ్చిన ట్యూమర్ కారణంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే ఎడమ చేయి తొలగించగా, వెన్నెముక సర్జరీ కూడా జరిగింది. కాగా చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. శుక్రవారం విద్యార్థిని వైద్య చికిత్సకు మంత్రి రూ.లక్ష విలువైన LOC చెక్కును అందజేశారు.