కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్రధాన కోచ్గా టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేను నియమించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కోచ్గా ఉన్న చంద్రకాంత్ పండిత్ తప్పుకోవడంతో, KKR యాజమాన్యం ఆయన స్థానంలో కుంబ్లేను ఎంపిక చేసినట్లు సమాచారం. కుంబ్లే గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు కూడా కోచ్గా పని చేశాడు. దీనిపై యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.