NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీకి మరోసారి షాక్ తగిలింది. వెంకటాచలం మండలం సర్వేపల్లికి చెందిన 23 కుటుంబాలు TDP పార్టీలో చేరాయి. వేదాయపాళెంలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానం పలికారు. పాత, కొత్త నాయకులు అందరూ కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.