BDK: కరకగూడెం మండలంలో పోడు భూములలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం కరక గూడెం మండలం అశ్వాపురం అటవీ ప్రాంతంలో వలస గిరిజనులు వేట కొడవళ్ళతో సెక్షన్ ఆఫీసర్ గోవిందు, బీట్ ఆఫీసర్ కోటిపై దాడి చేశారు. దీంతో అధికారులకు స్వల్ప గాయాలు కాగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.