నటుడు దుల్కర్ సల్మాన్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. తన లగ్జరీ కారును సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ నటుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కారును తిరిగి ఇచ్చేయాలని కస్టమ్స్ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. అక్రమ మార్గాల్లో భూటాన్ నుంచి వాహనాలు దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేరళలో దాడులు చేసిన సంగతి తెలిసిందే.