ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం 45మంది లబ్ధిదారులకు రూ.30,14,666 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.