NZB: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇస్రో సందర్శనకు మండలంలోని పేట్ సంగెం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని జి. శరణ్య ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జీకే పరీక్షలో అద్భుత ప్రదర్శన కనబరిచి ఇస్రో సందర్శనకు తమ విద్యార్థిని ఎంపికవ్వడం గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు.