CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచలకిషోర్ వీరికి స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.