అన్నమయ్య: జిల్లా పోలీసుల గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ విజయవంతమైంది. 2019లో మొలకలచెరువు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నారాయణప్ప, శివ కుమార్, సుబ్రహ్మణ్యం, మంజునాథ్లకు తిరుపతి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. పోలీసుల పట్టు కొనసాగుతుందని తెలిపారు.