VZM: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపడుతున్న సంతకాల సేకరణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య పిలుపునిచ్చారు. గంట్యాడ మండలం కొండతామరాపల్లిలో పార్టీ శ్రేణులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు జగన్ ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు.