MNCL: జైపూర్ మండలం వేలాల గ్రామంలోని ఇసుక రీచ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఇసుక తీయాలని, ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.