NLG: దేవరకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు తాటికోల్లో NSS యూనిట్ 1&3 ఆధ్వర్యంలో 7 రోజుల ప్రత్యేక శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్రతి విద్యార్థి సామాజిక సేవలో పాల్గొనాలని ఎంజీయూ NSS కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి అన్నారు. NSS ఛైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.రమేష్, ప్రోగ్రామ్ ఆఫీసర్ జయప్రకాశ్, నారాయణ, నర్సింహా పాల్గొన్నారు.