ASR: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ డీ. కృష్ణమూర్తి నాయక్ ఇవాళ పాడేరు కార్యాలయంలో నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని నూతనంగా బాధ్యతలను స్వీకరించిన ఆయన తెలిపారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.