అన్నమయ్య కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు దీపావళి పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని శుక్రవారం సూచించారు. బాణాసంచా స్టాళ్ల భద్రత, ఫైర్ సేఫ్టీ, పార్కింగ్, పారిశుద్ధ్య చర్యలపై అన్ని శాఖల అధికారులను సమన్వయంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షాపులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా, ధరల పట్టికలు, సేఫ్టీ సూచనలు, స్టాళ్ల మధ్య సరిపడా దూరం పాటించాలన్నారు.