BHPL: కాటారం మండలంలో ఇవాళ APO వెంకన్న మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులు ఈ-కేవైసీ, ముఖచిత్రం అప్లోడ్ గడువును అక్టోబర్ 30 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 12 మండలాల్లో 1,30,944 కార్మికులలో 87,699 మంది ఈ-కేవైసీ నమోదు పూర్తయిందని తెలిపారు. 67.03% పూర్తయినట్లు, మిగిలినవారు త్వరగా నమోదు చేయాలని సూచించారు.