GNTR: పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇవాళ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యుల అందుబాటు వేళలు, రోగులను పరీక్షించే విధానం, మందుల లభ్యత, పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది పని తీరు, హాజరు వంటి అంశాలను సమీక్షించారు. సిబ్బంది పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.