MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ, బీసీ బంధువులు శనివారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. రేపటి తెలంగాణ బంద్‌కు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.