SRD: కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల శిబిరంలో భాగంగా శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల, పాఠశాల విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.