BDK: పాల్వంచ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ DCMS కొత్వాల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తీర్మానించిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించిందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.