తిరుమల రెండో ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. వేకువజామున 3 గంటలకు ఘాట్ రోడ్డులో చిరుత సంచరించింది. చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారు జామున ఈ ఘటన జరగడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, గతంలో ఈ ప్రాంతాల్లో పలు మార్లు చిరుత సంచరించిన విషయం తెలిసిందే.