మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందూర్బార్ జిల్లాలోని చాంద్షాలి ఘాట్ రోడ్డులో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. 15 మందికి తీవ్రంగా గాయాలయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.