ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న తొలి వన్డే.. కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, భారత క్రికెట్ అభిమానులకు అక్షరాలా పండగే. తమ ఆరాధ్య క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను దాదాపు 7 నెలల విరామం తర్వాత మైదానంలో చూడబోతుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. దేశమంతా రేపు దీపావళి సంబరాలకు సిద్ధమవుతుంటే, క్రికెట్ ప్రియులకు మాత్రం ఈరోజు నుంచే అసలైన పండుగ మొదలైంది.