SKLM: ఆమదాలవలస మండలం దన్నాన పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో మొత్తం 9 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ బి. జానకీ రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు.