KMM: బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందని శుక్రవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే బీసీల రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈనెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.