GNTR: పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న విద్యార్థులకు ఆధార్ నమోదు ప్రక్రియను నెల రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. జనన ధృవీకరణ పత్రాలు ఉన్నవారిని, లేనివారిని గుర్తించాలన్నారు. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి కావాలని, ప్రతి ఒక్కరూ ఆధార్లో నమోదై ఉండాలన్నారు. ఈ నెల 23 నుంచి 30 వరకు ప్రత్యేక ఆధార్ కేంద్రాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.