SRD: ఓల్డ్ రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మీట్ మార్కెట్‌ను 2 కోట్లతో ఆధునికరిస్తున్నామని కార్పొరేటర్ పుష్పా నగేష్ అన్నారు. సాంకేతిక యంత్రాల, అత్యాధునిక మార్కెట్ నిర్మాణానికై GHMC ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 2 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. GHMC అధికారులైన SE శంకర్, EE సురేష్, DE కృష్ణవేణి, AE దివ్యలతో కలిసి మీట్ మార్కెట్‌ను పరిశీలించారు.