VSP: రాజమహేంద్రవరంలోని తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా మునిరత్నం నాయుడును నియమించడంపై జాతీయ విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం తాను ఎంతో కృషి చేశానన్నారు.