E.G: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17,000లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.