NZB :కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు.