వికారాబాద్: పరిగి పట్టణంలో బీసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పార్లమెంట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న ఈ ధర్నా కారణంగా బీజాపూర్ -హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.