VZM: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ రాంబార్కి శరత్‌బాబు అన్నారు. శనివారం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్చమైన గాలి పీల్చడం ప్రతిఒక్కరి బాధ్యతని, స్వచ్చమైన గాలి కోసం మొక్కలు నాటి సంరక్షణ చేయాలన్నారు. మున్సిపల్ కమీషనర్ పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేయుంచారు.