ELR: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని జిల్లా ఎంపీ మహేష్ ఇవాళ అన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో భాగంగా రూ.1,100 కోట్లు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపు నిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్నారు.