KMM: నేలకొండపల్లి మండలంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మాన్యువల్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ టిల్లర్ వంటి యంత్రాలను సబ్సిడీపై అందిస్తామని మండల వ్యవసాయ శాఖ అధికారి రాధా తెలిపారు. ఈ నెల 21 నుంచి 24కు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.